- సీపీఎం కేంద్ర కార్యాలయం ప్రకటన
న్యూఢిల్లీ, వెలుగు: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరోసారి విషమించింది. ఈ మేరకు మంగళవారం సీపీఎం కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ కు ఏచూరి చికిత్స పొందుతున్నారని తెలిపింది.
క్టర్ల బృందం ఏచూరిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆగస్టు 19న చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.