
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి aసుందరయ్య 40 వర్ధంతి సందర్భంగా సీపీఎం ఖానాపురం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి ఇందిరా నగర్ లో ఉన్న సీపీఎం పార్టీ ఆఫీస్ వరకు ఎర్రదండు కవాతు నిర్వహించారు. అనంతరం సీపీఎం హవేలీ కమిటీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని ఈ పరిస్థితులకు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. భవిష్యత్తులో మహానేత పుచ్చలపల్లి సుందరయ్య చూపిన మార్గంలో పయనిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు.