
కామేపల్లి, వెలుగు : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, ప్రజలు విష జ్వరాల బారిన పడకముందే మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం కామేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలతో పలు రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి వెంటనే రిపేర్లు చేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మేరుగు సత్యనారాయణ, కొండబోయిన నాగేశ్వరరావు, దుగ్గి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు బాధవత్ శ్రీనివాస్, కిన్నెర రామచంద్రయ్య, రాయల సత్యనారాయణ, బావ్ సింగ్, నాగభూషణం, సత్యం ,లక్ష్మి, కొండల్ తదితరులు పాల్గొన్నారు.