రైతులందరికీ బోనస్​ ఇవ్వండి : సీపీఎం నేతలు

రైతులందరికీ బోనస్​ ఇవ్వండి : సీపీఎం నేతలు
  •     సీఎంకు సీపీఎం నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రైతులు, ఇండ్లు లేని పేదల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ ను సీపీఎం నేతలు కోరారు. శనివారం సీపీఎం నేతలు జి. నాగయ్య, జులకంటి రంగారెడ్డి, ఎస్. వీరయ్య.. సీఎం ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు. రైతులందరికీ బోనస్​ ఇవ్వాలని కోరారు. జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేలా చూడాలన్నారు. 

బీఆర్ ఎస్ పాలనలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగుభూమి సమస్యలపై ఆందోళనలు చేస్తున్నవారిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని, వారికి 120 గజాల స్థలం కేటాయించి పట్టాలు ఇవ్వాలని కోరారు.