డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలె

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలె

రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ... విద్యార్థులకు పీజు రీఎంబర్స్ మెంట్ చేయాలని,  వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు కాకుండా జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లతోపాటు రేషన్ కార్డులను అందజేయాలని డిమాండ్ చేశారు.  అభయహస్తం డబ్బులను మహిళలకు తిరిగి చెల్లించాలని కోరారు

లేకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ చీరల పంపిణీ రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా... 18 సంవత్సరాలు నిండిన యువతులందరికీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు