- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌చేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు అన్ని అర్హతలున్నా.. ఎన్నికలకోడ్ వంటి వివిధ కారణాలతో రెగ్యులరైజ్ చేయలేదన్నారు.
దాంతో ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కొంత మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను జీవో నెం.16 ద్వారా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని గుర్తుచేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.