ట్యాంక్‌బండ్, వెలుగు: గుండెపోటుతో ప్రాణాపాయంలో ఉన్నవారికి సకాలంలో సీపీఆర్ అందించడం పునర్జన్మనిచ్చినట్లేనని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సెక్రటేరియట్ ఎదుట నిర్వహించిన సీపీఆర్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేపట్టిన ఫౌండేషన్ చైర్‌పర్సన్ కంజర్ల విజయలక్ష్మిని అభినందించారు.
