మల్లెపల్లి చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీళ్లు

మల్లెపల్లి చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీళ్లు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మల్లెపల్లి చెరువు కట్టకు తెగింది. భారీ వర్షాల కారణంగా.. నాలుగు రోజులుగా చెరువులోకి నీళ్లు పోటెత్తాయి. చెరువు సామర్థ్యానికి మించి నీళ్లు రావటంతోపాటు వర్షాల కారణంగా కట్ట బలహీనపడింది. 

చెరువు కట్ట విషయంలో అధికారులతోపాటు గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. అయినా ఫలితం లేకపోయింది. చెరువు చుట్టూ ఉన్న కట్టకు.. ఓ వైపు భారీ గండి పడింది. దీంతో చెరువులోని నీళ్లు కింద ఉన్న పొలాల్లోకి పోటెత్తింది. గండిని పూడ్చేందుకు అధికారులు, రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇసుక బస్తాలతో పూడ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే గండి పెద్దగా ఉండటం.. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో సాధ్యం కష్టతరంగా మారిందని చెబుతున్నారు అధికారులు. ఓ వైపు వర్షాలు పడుతున్నానే ఉన్నాయని.. చెరువులోకి నీటి ప్రవాహం సైతం అధికంగా ఉందంటున్నారు అధికారులు. గండిని పూడ్చేందుకు పెద్ద ఎత్తున ఇసుక బస్తాలను తెప్పిస్తున్నామని.. వీలైనంత త్వరలోనే పని పూర్తి చేస్తామని చెబుతున్నారు. 

వర్షాలతో చెరువులోకి వచ్చిన నీళ్లు.. గండి పడి వృధాగా పోవటంతో రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పొలాల్లోకి నీళ్లు రావటంతో.. చుట్టుపక్కల మోకాళ్ల లోతులో నీరు నిలబడ్డాయి. 2023, జులై 27వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.