‘గివప్ సమ్​థింగ్’ క్యాంపెయిన్

‘గివప్ సమ్​థింగ్’ క్యాంపెయిన్
  • ప్రారంభించిన గుజరాత్ కలెక్టర్
  • ప్రజలు చిన్నచిన్న అలవాట్లు వదులుకోవాలని పిలుపు

జైపూర్: కరోనా ఎఫెక్టు సమయంలో ప్రతిఒక్కరూ చిన్న చిన్న వస్తువులను వదులుకునేందుకు ప్రయత్నించాలంటూ రాజస్థాన్ లో ఓ సివిల్ సర్వెంట్ ‘గివప్ సమ్​థింగ్’ క్యాంపెయిన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న కఠినమైన సమయాల్లో చాక్లెట్ కావాలనే ఇష్టం, సాయంత్రం పూట ఐస్ క్రీం తినాలనే కోరిక, రెస్టారెంట్ భోజనం లాంటి అలవాట్లను త్యాగం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు రోజువారి అవసరాల నుంచి ఇలాంటి వస్తువులను జాబితాను తీసివేయాలని ఆయన కోరుతున్నారు. మూడు రోజుల కిందట ప్రారంభించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు ప్రజలు, కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించిందని చురు జిల్లా కలెక్టర్ సందేశ్ నాయక్ అన్నారు. జిల్లాలో కర్ఫ్యూ కారణంగా చాలా మంది ప్రజలు పండ్లు, చాక్లెట్లు, కూరగాయలు, ఐస్ క్రీమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉండట్లేవని చెప్పడం తన దృష్టికి వచ్చిందన్నారు.

వదులుకోవాల్సిన టైం ఇది
‘‘ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూడాలన్నదే మా ప్రయత్నం. ఇలాంటి కష్ట సమయాల్లో సాధ్యమైనమేరకు చిన్నచిన్న త్యాగాలు చేయాలని ప్రజల్ని కోరాం. మనల్ని మనం నిలబెట్టుకోవాలంటే కొన్నింటిని వదులుకోవాల్సిన సమయం ఇది. లాక్ డౌన్ అమల్లో ఉన్నంత కాలం నా మధ్యాహ్నం లంచ్​ని వదులుకుంటున్నాను. ప్రజల్ని కూడా ఏదో ఒక తప్పనిసరి కాని వాటిని వదులుకోవాలని కోరాం. కరోనా వైరస్ దేశంలో సంక్షోభానికి దారితీసింది. అందుబాటులో ఉన్న వనరులను న్యాయంగా ఉపయోగించాలి. కచ్చితంగా అవసరమైన వాటిమీదనే దృష్టిపెట్టాలి” అని సందేశ్ సింగ్ చెప్తున్నారు.

ప్రముఖుల నుంచి రెస్పాన్స్
కలెక్టర్ పిలుపు మేరకు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అంటార్కిటికా టూర్ నుంచి తెచ్చుకున్న వస్తువులను వేలం వేసి.. వచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తానని రాజీవ్ బర్డా అనే టూరిస్టు చెప్పారు. బీర్బల్ నోఖ్వాల్ అనే వ్యక్తి కూడా తనకు ఇష్టమైన ఆలూని వదులుకుంటానని నిర్ణయించుకోగా.. ఆయుర్వేద డాక్టర్ లీలాధర్ శర్మ తన ఆహారాన్ని సగానికి తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. గాంధేయన్ కార్యకర్త ఎల్ డి జోషి తన టిఫిన్, పాలు వదిలేసి ఆదా వాటి ద్వారా ఆదా అయిన డబ్బుతో ఇతరులకు సాయం చేస్తానని చెప్తున్నాడు.