బ్యాంకులకు క్రెడిట్ కార్డుల గండం

బ్యాంకులకు క్రెడిట్ కార్డుల గండం
  • రిస్కులో లక్ష కోట్ల విలువైన లోన్లు

ముంబై:   కరోనా వల్ల చాలా మంది క్రెడిట్​ కార్డు హోల్డర్ల ఆదాయం విపరీతంగా పడిపోవడంతో వసూళ్లు తగ్గుతున్నాయని, ఇవి మరింత పెరుగుతాయని ఆర్​బీఐ హెచ్చరించింది. క్రెడిట్​కార్డుల​ బకాయిలు ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో రూ.లక్ష కోట్లు దాటాయని వెల్లడించింది. ‘‘గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత బకాయిల విలువ పదిశాతం ఎక్కువ. బ్యాంకులు, క్రెడిట్​కార్డు  కంపెనీలు అలర్ట్​గా ఉండాలి.  క్రెడిట్ కార్డు బిజినెస్​లో ఐదుశాతం నెగెటివ్​ గ్రోత్ రికార్డు అయింది. ఎగవేతలను తట్టుకోవడానికి పది శాతం ఫండ్స్​ను ప్రొవిజన్​ చేయాలి” అని ఆర్​బీఐ బ్యాంకులను ఆదేశించింది. క్రెడిట్​ కార్డ్, పర్సనల్​ లోన్స్​ వంటి అన్​సెక్యూర్డ్​ లోన్స్​ గత ఐదేళ్లలో విపరీతంగా పెరిగాయి. వసూళ్లు తక్కువగా ఉండటం, మొండిబాకీలు పెరగడంతో వీటి జారీ ఇప్పుడు మోస్తరు స్థాయిలో ఉంది. కొన్ని బ్యాంకు లోన్లలో ఈ రెండు సెగ్మెంట్ల వాటాయే 30 % వరకు ఉంది. గ్లోబల్ ఎకానమీ దెబ్బతినడం, జాబ్స్ పోవడం, జీతాలు తగ్గడంతో అన్ని దేశాల్లో లోన్ల ఎగవేతలు పెరగొచ్చని బ్యాంకింగ్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. హోం, కార్​ లోన్ల కంటే క్రెడిట్​ కార్డు, పర్సనల్​ లోన్ల వసూళ్లు తక్కువగా ఉంటాయని అంటున్నారు. దీంతో రిస్కు ఎక్కువగా ఉండే కమర్షియల్​, బిజినెస్​కార్డులను యాక్సిస్​ వంటి బ్యాంకులు బాగా తగ్గిస్తున్నాయి.