సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలనుకుంటోంది : మోదీ

సనాతన ధర్మాన్ని  ఇండియా కూటమి  నాశనం చేయాలనుకుంటోంది : మోదీ

ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న  అక్కడ రూ, 50 వేల700 కోట్లకు పైగా  విలువైన పెట్రో కెమికల్ కాంప్లెక్స్  సహా రాష్ట్రంలో మరో పది  కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పుకోచ్చారు. 

జీ20 సదస్సును భారత్‌ ఎలా విజయవంతంగా నిర్వహించిందో మీరంతా చూశారని.. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఘనత దేశ ప్రజలకు దక్కుతుందని.. ఇది 140 కోట్ల మంది ప్రజల విజయమని  ప్రధాని అన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి ఇండియాపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమికి నాయకుడు లేడని .. వారు భారతదేశ సంస్కృతిపై దాడి చేయడానికి రహస్య అజెండాను కూడా నిర్ణయించుకున్నారని ఆరోపించారు. సనాతన సంస్కృతిని అంతం చేయాలనే తీర్మానంతో ఇండియా కూటమి వచ్చిందన్నారు.   దేశాన్ని ప్రేమించే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని..   అలాంటి వారిని మనం అరికట్టాలని చెప్పారు.