టీ20 వరల్డ్ కప్..6 లక్షల టికెట్లు అమ్మకం

టీ20 వరల్డ్ కప్..6 లక్షల టికెట్లు అమ్మకం

క్రికెట్లో వరల్డ్ కప్కు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా ధనాధన్ ప్రపంచకప్ను అభిమానులు మరింత ఇష్టపడతారు. తక్కువ సమయంలో..ఎక్కువ వినోదాన్ని అందించే ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచులను చూసేందుకు జనం పోటీ పడతారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా మొదలవనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టీ20 వరల్డ్ కప్ టికెట్లు అధికారిక సైట్లలో పెట్టిన గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే 6 లక్షలకు పైగా టికెట్లను విక్రయించామని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. 

ఆసీస్, కివీస్ మధ్య ఫస్ట్ మ్యాచ్..
ఈ నెల 16న టీ20 వరల్డ్ కప్ మొదలవనుంది. మొదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి.  గ్రూప్ స్టేజ్ లో  శ్రీలంక, నమీబియా, UAE, వెస్టిండీస్, నెదర్లాండ్స్ , స్కాట్లాండ్ , జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు పోటీపడతాయి. అక్టోబర్ 22 నుంచి  సూపర్ 12 రౌండ్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది.

అందరి చూపు భారత్ పాక్ మ్యాచ్ పైనే..
సూపర్ 12లో భాగంగా 23వ తేదీన చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ తలపడనున్నాయి. మెల్ బోర్న్లో ఈమ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించి 90 వేల టికెట్లు విక్రయించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇవే కాదు..మిగతా  మ్యాచుల టికెట్లన్నీ అమ్ముడయిపోయాయి.  గీలాంగ్‌లోని 36 వేల కెపాసిటీ గల కార్డినియా పార్క్ స్టేడియంలో శ్రీలంక నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.