లైంగిక దాడి కేసు.. 13 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్

లైంగిక దాడి కేసు.. 13 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ పీటర్ రోబక్ చనిపోయి 13 ఏళ్ళు గడిచిపోయానని అతనిపై నమోదైన లైంగిక దాడి కేసు విచారణ సంధర్బంగా చెషైర్ కొరోనర్స్ కోర్టు వెల్లడించింది. చనిపోయే సమయంలో అతను తీవ్ర నిస్పృహకు లోనైనట్లు తెలిపింది. రోబక్ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిరోజుల ముందు అతనిపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఆయన హోటల్ గదిలో 26 ఏళ్ల యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణలో ఉండగానే అవమానభారంతో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కోర్టు నిర్ధారించింది. 

ఎవరీ పీటర్ రోబక్..? ఏంటి ఈ కేసు..?

ఆల్‌రౌండరైన పీటర్ రోబక్.. ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెటర్. 1974 నుంచి 1991 వరకు సోమర్సెట్‌ జట్టు తరపున క్రికెట్ ఆడారు. కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 335 మ్యాచ్‌లు ఆడిన రోబక్ 17558 పరుగులు చేశాడు. 33 సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో బౌలింగ్‌లో 72 వికెట్లు పడగొట్టాడు. 1991లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోబక్. .ఆ తరువాత కామెంటేటర్ గా పనిచేశారు. 

2011లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఓ మ్యాచ్ కామెంటరి కోసం రోబక్ కేప్ టౌన్ వెళ్లారు. ఆ సమయంలో సదరన్ సన్ హోటల్లో 26 ఏళ్ల వ్యక్తిపై లైంగిక దాడికి పాల్పడ్డారనేది ఆయనపై ఉన్న అభియోగం. అదే హోటల్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పాత కథనాలు ఉన్నాయి.