బుమ్రా విషయంలో బీసీసీఐపై విమర్శలు

బుమ్రా విషయంలో బీసీసీఐపై విమర్శలు

సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు ప్రాక్టీస్‌‌‌‌ సందర్భంగా బ్యాక్‌‌‌‌ పెయిన్‌‌‌‌ వచ్చిందని బుమ్రా ఫిర్యాదు చేయడంతో అతడిని మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పించారు. జట్టుతో కలిసి తను తిరువనంతపురం రాలేదు. జులైలో  ఇంగ్లండ్‌‌‌‌‌‌ టూర్‌‌‌‌లో వెన్ను గాయానికి గురైన బుమ్రా ఆసియా కప్‌‌‌‌నకు దూరంగా ఉన్నాడు. దాని నుంచి కోలుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో చివరి రెండు టీ20ల్లో ఆడి ఆరు ఓవర్లే బౌలింగ్​ చేశాడు. ఈ లోపే గాయం తిరగబెట్టడంతో అతని రిహాబిలిటేషన్‌‌‌‌పై అనుమానాలు కలుగుతున్నాయి.   వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నేపథ్యంలో బుమ్రా రీఎంట్రీ విషయంలో బీసీసీఐ తొందరపడి మూల్యం చెల్లించుకుందన్న విమర్శలు వస్తున్నాయి. బుమ్రా గాయానికి సర్జరీ అవసరం లేకపోయినా.. పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది.

బుమ్రా లేకుంటే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా అవకాశాలు కచ్చితంగా దెబ్బతింటాయి. బుమ్రా దూరమైతే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టాండ్‌‌‌‌బైలో ఉన్న దీపక్‌‌‌‌ చహల్‌‌‌‌ లేదా మహ్మద్‌‌‌‌ షమీని మెయిన్‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి తీసుకునే చాన్సుంది. బుమ్రా ఇప్పుడు ఎన్​సీఏకు వెళ్లనుండగా.. సౌతాఫ్రికాతో మిగతా రెండు టీ20లకు సిరాజ్​ను ఎంపిక చేసే అవకాశం ఉంది.