మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎలాంటి రూమర్లూ నమ్మొద్దు

మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎలాంటి రూమర్లూ నమ్మొద్దు

భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చాహల్ స్పందించాడు.  తన వైవాహిక జీవితం గురించి ఇలాంటి రూమర్లను నమ్మవద్దని కోరాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టాడు.‘‘మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎలాంటి రూమర్లూ నమ్మొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి వీటికి ముగింపు పలకండి’’  అంటూ  చాహల్ కోరాడు.  

ఇంతకీ ఏం జరిగిందంటే? 

చాహల్‌ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో కొత్త జీవితం మొదలవుతోంది అని రాసి ఉంది. అటు చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లోచాహల్‌ పేరును తొలగించింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  ఈ క్రమంలో చాహల్‌ రూమర్లను నమ్మవద్దని కోరుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ పెట్టాడు. 

డిసెంబర్‌ 2020లో పెళ్లి

చాహల్‌, ధనశ్రీ వర్మ డిసెంబర్‌ 2020లో  వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  గురుగ్రామ్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. ముంబయికి చెందిన ధనశ్రీ వర్మ డెంటిస్ట్‌, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కూడా... సోషల్ మీడియాలో ఈమెకు వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది.  చాహల్‌ భారత క్రికెట్ జట్టులో అగ్రగామి స్పిన్ బౌలర్లలో ఒకరు.