గతేడాదితో పోలిస్తే 66 శాతం ఎక్కువగా సైబర్ క్రైమ్స్

గతేడాదితో పోలిస్తే 66 శాతం ఎక్కువగా సైబర్ క్రైమ్స్

హైదరాబాద్, వెలుగు: రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 21,685 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30వ తేదీ వరకు మొత్తం 25,815 కేసులు రిజిస్టర్ అయ్యాయి. దాదాపు 4 వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓవరాల్ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 శాతం పెరిగింది. ఈ వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శనివారం వెల్లడించారు. 

నాగోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లతో కలిసి 2022 యాన్యువల్ రిపోర్టును రిలీజ్ చేశారు.  సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరాలు గతేడాది కంటే 66 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.  డ్రగ్స్ కేసులు 140శాతం, ఆర్థిక నేరాలు 23 శాతం, రోడ్డు ప్రమాదాలు 18.76 శాతం, మహిళలపై నేరాలు17 శాతం పెరిగాయి. పలు రకాల కేసులు తగ్గుముఖంరాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా ఏడోసారి యాన్యువల్ రిపోర్టు రిలీజ్ చేసినట్లు మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అత్యధికంగా శిక్షల శాతం 59 శాతానికి పెంచామని తెలిపారు. ఈ ఏడాది మానవ అక్రమ రవాణాలో 62 కేసులు నమోదు చేసి132  మందిని అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.79 మంది బాధితులను రక్షించినట్లు వెల్లడించారు. డ్రంకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ కేసుల్లో 52 మంది ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆయా డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. 

కాగా కొన్ని రకాల కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది హత్యలు 29 శాతం, కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 38 శాతం, సూసైడ్ కేసులు 50శాతం, మహిళల హత్య కేసులు 63 శాతం, లైంగిక దాడి కేసులు 1.33శాతం, వరకట్నపు కేసులు 5.88 శాతం, అటెన్షన్ డైవర్షన్ కేసులు తగ్గాయని ఆయన చెప్పారు.

రాచకొండలో కొత్తగా మహేశ్వరం డీసీపీ జోన్, పీఎస్​ల ఏర్పాటు

ఎల్​బీనగర్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా మహేశ్వరం డీసీపీ జోన్​ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే మూడు డీసీపీ జోన్లు ఉండగా నాలుగో డీసీపీ జోన్​గా మహేశ్వరంను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఎల్​ బీనగర్ ​డీసీపీ జోన్ ​కింద ఉన్న ఇబ్రహీంపట్నం ఏసీపీ డివిజన్ ఇకపై  మహేశ్వరం డీసీపీ పరిధిలోకి చేరనుంది. 

ఈ వివరాలను సీపీ మహేశ్ భగవత్ ప్రకటించారు. కొత్తగా పోలీసు స్టేషన్లు ఏర్పాటుకానున్న ఏరియాల జాబితాలో చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్​తో పాటు మల్కాజిగిరి జోన్​లో విమెన్ పీఎస్​లున్నాయని చెప్పారు. ఘట్​కేసర్, జవహర్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పీఎస్​లు ఏర్పాటు అవుతాయన్నారు. యాదాద్రి ఆలయానికి ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.