వీసా పేరుతో మోసం..కేఏ పాల్ పై క్రిమినల్ కేసు

వీసా పేరుతో మోసం..కేఏ పాల్ పై క్రిమినల్ కేసు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై  క్రిమినల్ కేసు నమోదయింది. వీసా పేరుతో డబ్బులు తీసుకుని తనను మోసం చేశారంటూ సత్యవతి అనే  యువతి పంజాగుట్టలో ఫిర్యాదు చేసింది. దీంతో  కేఏ పాల్ తో పాటు ఆయన అనుచరులు జ్యోతి, విజయ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా స్పాన్సర్షిప్ లెటర్ అందిస్తానని రామచంద్రపురం కు చెందిన సత్యవతి అనే మహిళను కేఏ పాల్ అండ్ టీం 15 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు  రెండు లక్షల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నారు. ఆమె దగ్గర నుంచి చెక్కును తీసుకుని డబ్బులు డ్రా చేసింది పాల్ అండ్ టీం. తర్వాత స్పాన్సర్ షిప్ లెటర్ ఇవ్వకుండా ఆమె నంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పాల్, విజయ్, జ్యోతి లపై కేసు నమోదు చేశారు.