- నేరస్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే
- కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం దారుణం
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం, రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య చాలా బాధాకరమని, నేరస్తులు ఎంతటివారైనా శిక్ష తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు.
శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ ఎప్పుడూ హింసా రాజకీయాలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను చేపట్టలేదని, విచారణ పూర్తికాకుండానే కాంగ్రెస్సే హత్య చేసిందని కొంత మంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం వారి కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. రామారావు హత్యకు కాంగ్రెస్ పార్టీకి గాని, అక్కడి లోకల్ నాయకులకు గాని ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
