రొనాల్డో డైట్ ప్లాన్‌ NASA శాస్త్రవేత్తలు చూసుకుంటారు: పాక్ మాజీ క్రికెటర్

రొనాల్డో డైట్ ప్లాన్‌ NASA శాస్త్రవేత్తలు చూసుకుంటారు: పాక్ మాజీ క్రికెటర్

పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో డైట్ ప్లాన్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా విచిత్ర ప్రకటన చేశాడు. రోనాల్డో డైట్ ప్లాన్ బాధ్యతలు యూఎస్ స్పేస్ ఏజెన్సీ 'నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA)' రూపొందిస్తుందంటూ తెలివి తక్కువ వ్యాఖ్యలు చేశాడు.

ఆటగాళ్లకు ఎంత టాలెంట్​ ఉన్నా.. ఫిట్​నెస్​ లేకపోతే ఆడడం చాలా కష్టం. అందునా ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో అది కీలక పాయింట్ కూడానూ. 90 నిమిషాల పాటూ సాగే ఈ  గేమ్‌లో ప్రతీ క్షణం పరుగెడుతూనే ఉండాలి.. ప్రత్యర్థి జట్టు గోల్ వేయకుండ ఆపడంతో పాటు ముందుగానే గోల్ వేసేందుకు ప్రయత్నించాలి. సరైన ఫిట్​నెస్​ లేకపోతే అది సాధ్య పడదు. అందుకు తగ్గట్టుగానే ఫుట్‌బాల్ క్రీడాకారులు కఠిన డైట్ పాటిస్తుంటారు. ఈ రహస్యాలు తనకు తెలుసనేలా పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా గొప్పలకు పోయే ప్రయత్నం చేశాడు. ఈ  క్రమంలో నోటికొచ్చింది వాగి నలుగురిలో నవ్వులు పాలు అయ్యాడు.   

"రొనాల్డో కి జో డైట్ ప్లాన్ హై వో నాసా కే శాస్త్రవేత్తలు సెట్ కర్తే హైన్" (నాసా శాస్త్రవేత్తలు రొనాల్డో డైట్ ప్లాన్‌ని సెట్ చేస్తున్నారు).. అని రమీజ్ రాజా పాకిస్తాన్ కు చెందిన ఓ మీడియా ఛానెల్ లో మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

పాక్ క్రికెటర్ల కాంట్రాక్ట్.. NASAకే..!

రమీజ్ రాజా వ్యాఖ్యలపై నెటిజెన్స్ ఛలోక్తులు విసురుతున్నారు. ఓహో తమకే తెలియదే.. నాసా ఇలాంటి బాధ్యతలు కూడా చూస్తుందా! హేళన చేసే వారు కొందరైతే, ఇకపై పాక్ క్రికెటర్ల ఫిట్​నెస్ కాంట్రాక్ట్ కూడా నాసాకే అప్పగించాలని సలహాలు ఇచ్చేవారు మరికొందరు.