ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అనుష్క శర్మ తన అరంగేట్ర మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది. అనుష్క శర్మ అంటే వెంటనే కోహ్లీ భార్య అని గుర్తుకొస్తే పొరపాటే. ఆమె మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా క్రికెటర్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం (జనవరి 10) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో గుజరాత్ తరపున ఆడుతున్న అనుష్క తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో 30 బంతుల్లోనే 44 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్ లో 7 ఫోర్లున్నాయి.
మూనీ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అనుష్క.. గార్డ్ నర్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరి జోడీ ఏకంగా 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఈ క్రమంలో అనుష్క ఎలాంటి చెత్త షాట్లకు వెళ్లకుండా చూడచక్కని షాట్లతో అలరించింది. వాస్తవానికి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అనుష్కను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయాల్సి ఉంది. రూ. 10 లక్షల కనీస ధరతో వేలల్లోకి వచ్చిన అనుష్కను కొనడానికి రాయల్ ఛాలెంజర్స్ బాగా ఆసక్తి చూపించింది. రూ.40 లక్షల వరకు బిడ్ కొనసాగించింది. చివరికి రూ.45 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ సీన్ మెగా ఆక్షన్ లో హైలెట్ గా మారింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డనర్ 65 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. అనుష్క శర్మ 40 పరుగులు చేసి రాణించగా.. సోఫీ డివైన్ 38 పరుగులు చేసి పవర్ ప్లే లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో జార్జియా వేర్‌హామ్ 10 బంతుల్లోనే 3 సిక్సర్లతో 27 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది.
ఎవరీ అనుష్క శర్మ..?
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కావడం.. అదే పేరున్న ప్లేయర్ అనుష్క శర్మ మహిళల ఆర్సీబీ జట్టులోకి వస్తే ఆమె పేరు బాగా పబ్లిసిటీ అవ్వడం ఖాయం. కానీ గుజరాత్ టైటాన్స్ అనుష్కను దక్కించుకుంది. ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అక్టోబర్‌లో జరిగిన సీనియర్ ఉమెన్స్ ఇంటర్-జోనల్ టీ20 ట్రోఫీలో లిస్ట్ ఏ లో సెంట్రల్ జోన్ తరపున ఆడుతూ 63 యావరేజ్.. 125 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసింది. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున అద్భుతంగా రాణించింది. దూకుడుగా ఆడుతూ తన స్పిన్ బౌలింగ్ లోనూ రాణిస్తుంది.
►ALSO READ | IND vs NZ: టాప్-5 ఫిక్స్.. సిరాజ్‌కు ఛాన్స్.. తొలి వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
ఈ 22 ఏళ్ళ మధ్యప్రదేశ్ ప్లేయర్ ఒకవేళ ఆర్సీబీ జట్టులో ఉంటే "అనుష్క శర్మ" అని పేరు పెట్టుకున్న ఆమె బాగా వైరల్ అయ్యేది. ఎందుకంటే ఆర్సీబీ జట్టు అంటే విరాట్ కోహ్లీ పేరు మారుమ్రోగుతుంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కావడంతో ఆమె పేరు కూడా ట్రెండింగ్ లో నిలిచేది.
A debut to remember for Anushka Sharma. 🙌#WPL2026 #GG #UPW #MrCricketUAE pic.twitter.com/OKVqaAdmLG
— Mr. Cricket UAE (@mrcricketuae) January 10, 2026
