నిమ్స్​లో క్రిటికల్​ సర్జరీలు సక్సెస్

నిమ్స్​లో క్రిటికల్​ సర్జరీలు సక్సెస్

హైదరాబాద్, వెలుగు : నిమ్స్ హాస్పిటల్లో మూడు క్రిటికల్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్లు బుధవారం డిశ్చార్జ్ కానున్నారు. సర్జికల్ | గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హెచ్ ఓడీ, నిమ్స్ డీన్ డాక్టర్ బీరప్ప, కార్డియాలజీ ట్రాన్స్ ప్లాంటేషన్ హెచ్ ఓడీ డాక్టర్ అమరేశ్ రావు, యూరాలజీ హెచ్డీ రాహుల్ దేవరాజ్, అనస్థీషి యా హెచ్ ఓడీ నిర్మలా మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల బ్రెయిన్ డెడ్ గా నిర్ధారణ అయిన 45 ఏండ్ల మహిళ, 27 ఏండ్ల యువకుడి అవ యవాలను కుటుంబ సభ్యులు నిమ్స్ దానం చేశా రన్నారు. వాటి సాయంతో ముగ్గురికి అవయవ మార్పిడి చికిత్స చేసినట్టు వెల్లడించారు. స్కిమాటిక్ కార్డియోమయోపతి వ్యాధితో బాధపడుతున్న 57 ఏండ్ల వ్యక్తికి గుండె మార్పిడి సర్జరీ చేశామన్నారు. డా క్టర్ అమరేశ్ రావు నేతృత్వంలోని కార్డియాక్ సర్జన్ల బృందం క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్లో బాధపడుతున్న 27 ఏండ్ల మహిళకు కాలేయ మార్పిడి సర్జరీ నిర్వహించా మన్నారు. డాక్టర్ తుమ్మ వేణు మాధవ్, డాక్టర్ పద్మజ డాక్టర్ ఇందిర, డాక్టర్ శివాని, డాక్టర్ నిర్మల, డాక్టర్ సుకన్యతో కూడిన బృందం కాలేయ మార్పిడి సర్జరీ నిర్వహించారన్నారు.

హైదరాబాద్లోని ఇబ్రహీంప ట్నంకు చెందిన 42 ఏండ్ల వ్యక్తికి 2018లో రెండు మూత్రపిండాలు పాడైతే ఒక మూత్రపిండం ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేసినట్లు తెలిపారు. డాక్టర్ రాంరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్, డాక్టర్ చరణ్, డాక్టర్ ధీర జ్ బృందం ఈ సర్జరీ చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్ ఇప్పటి దాకా 24 లివర్ ట్రాన్స్ ప్లాం ట్ సర్జరీలు జరిగినట్టు వెల్లడించారు. ఒక్కో సర్జరీకి బయట కనీసం రూ.30లక్షల నుంచి రూ. 40 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అవన్నీ ఫ్రీగా చేసినట్టు. చెప్పారు. ఈ సందర్భంగా నిమ్స్ స్టాఫ్కు మంత్రి. హరీశ్ రావు అభినందనలు తెలిపారు.