పంచలింగాల గ్రామ పొలంలో మొసలి..పట్టుకున్న అటవీశాఖాధికారులు

పంచలింగాల గ్రామ పొలంలో మొసలి..పట్టుకున్న అటవీశాఖాధికారులు

వికారాబాద్​, వెలుగు : వికారాబాద్​ జిల్లా మర్పల్లి మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ భూమిలో మొసలి కనిపించి కంగారు పెట్టింది. ఆదివారం ఉదయం మొసలిని చూసిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని పట్టుకుని సంగారెడ్డి జిల్లా మంజీరా చెరువులో విడిచి పెట్టినట్టు మర్పల్లి అటవీ శాఖ సెక్షన్​ అధికారి కిషన్​నాయక్​ తెలిపారు. 

కాగా, పంచాలింగాల గ్రామానికి ఆనుకుని ఉండే నర్సాపూర్​చెరువు నుంచి ఈ మొసలి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు  మీటరన్నర పొడువున్న ఈ మొసలి సుమారు 100 కిలోల వరకు బరువు ఉందని అటవీశాఖాధికారులు చెప్పారు.