హాకీ క్రీడాకారిణి సునెలితకు ఏకలవ్య పురస్కారం

హాకీ క్రీడాకారిణి సునెలితకు ఏకలవ్య పురస్కారం

భువనేశ్వర్‌‌ :  రెండుసార్లు ఆసియా కప్‌‌ విజేతగా నిలిచిన భారత హాకీ క్రీడాకారిణి సునెలిత టొప్పో 2026 సంవత్సరానికి 34వ ఏకలవ్య పురస్కారానికి ఎంపికైంది. హాకీలో ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. ఒడిశాకు చెందిన 19 ఏళ్ల సునెలిత 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల టీమ్​ లో  ఉంది. ఈ పురస్కారం కింద రూ.7 లక్షల నగదు, ట్రోఫీ అందజేయనున్నారు. హాకీ క్రీడాకారుడు అమన్‌‌దీప్‌‌ లక్రా, బ్యాడ్మింటన్‌‌ క్రీడాకారిణి తన్వి పత్రి ప్రశంసా పురస్కారాలకు ఎంపికయ్యారు. 

వీరికి ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందించనున్నారు. ఒడిశాకు చెందిన యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 1993లో ఇండియన్‌‌ మెటల్స్‌‌ పబ్లిక్‌‌ చారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ (ఇంపాక్ట్‌‌) ఈ పురస్కారాన్ని  ప్రారంభించింది. గత రెండేళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాల ఆధారంగా యువ క్రీడాకారులను ఎంపిక చేస్తారు.