బావిలో మొసలి..బయటికి తీసిన రైతులు

బావిలో మొసలి..బయటికి తీసిన రైతులు

పెద్దపల్లి : వ్యవసాయ బావిలో మొసలి కనిపించడంతో భయాందోళనతో పరుగులు తీశారు రైతులు. ఈ సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం లొంకకేసారం గ్రామంలో జరిగింది. అప్పాల పెద్ద మధునయ్య  రైతుకు చెందిన వ్యవసాయ బావిలో రెండు రోజులుగా అరుపులు వినిపిస్తున్నాయి. అది గమనించిన రైతు బావిలోకి దిగి చూడగా మొసలి కనిపించింది. వెంటనే మోటర్ స్టార్ట్ చేయడంతో బావిలోని నీరు అయిపోయింది.

దీంతో  నీరు ఎక్కువగా లేకపోవడంతో పూర్తిగా కనిపించిన మొసలిని తాడుతో కట్టేసి మరో ఇద్దరి సాయంతో బయటికి లాగారు. మొసలిని బందించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు రైతులు. అయితే మొసలి చనిపోకుండా ఉండేలా తాడుతో కట్టేసి పొలంలో వదిలారు. మొసలిని చూడటానికి గ్రామస్థులు క్యూ కట్టారు.

crocodile-in-farmers-peddapalli-district