వామ్మో... మొసలి పడవ ఎక్కేస్తోంది... ఆ తరువాత ఏమైందంటే....

వామ్మో... మొసలి పడవ ఎక్కేస్తోంది... ఆ తరువాత ఏమైందంటే....

మొసళ్ళు సాధారణంగా నీటిలో జీవిస్తాయి.  పెద్ద పెద్ద చెరువులు, సముద్రాల్లో ఉంటాయి.  వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవి నీటి ఒడ్డుకు వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. అయితే ఇ ప్పుడు మొసలి పడవ ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సముద్రాల్లో  పడవల మీద ప్రయాణం చేస్తుంటారు.  ఆ ప్రాంతంలో మొసళ్లు ఉన్నప్పుడు అవి దూరంగా వెళ్లిపోతాయి.  అయితే ఇప్పుడు ఓ మొసలి జనాలతో కలిసి ప్రయాణం చేద్దామనుకుందో ఏమో తెలియదు కాని పడవ ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  @earth.reel ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  వీడియో  షేర్ అయింది, అందులో .  ఓ సరస్సు ఒడ్డున ఆగి ఉన్న పడవలోకి .. మొసలి ఎక్కేందుకు ప్రయత్నించింది .  నోరు తెరుస్తూ వస్తున్న మొసలి ఒక వ్యక్తి  నోటి పైభాగంలో తన చేతిని ఉంచి నీటిలోకి  నెట్టేస్తాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్  అయింది. 

 చాలా మంది నెటిజన్ల ఈ వీడియోపై కామెంట్ చేశారు. అలాంటి సందర్భంలో తాను అటువైపు నుంచి దూకి ఉండాల్సిందని ఒకరు అన్నారు. మొసలికి అప్పుడే పార్టీ పెట్టాలని అనిపిస్తోందని, అందుకే అలా వచ్చిందని ఒకరు అన్నారు. మొసలిని  మీ పెంపుడు జంతువుగా చేసుకోండి  మరొకరు అన్నారు. ఆహారం వెతుక్కుంటూ పైకి వచ్చిన అతనికి  మొసలి కుక్కపిల్లలా కనిపిస్తోందని మరొకరు అన్నారు