- నేడు తెల్లం, సంజయ్ ల విచారణ
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరపు న్యాయవాదులు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని వర్చ్యువల్‌గా, అరికెపూడి గాంధీని నేరుగా క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
పిటిషనర్ల అడ్వకేట్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు పలు ఆధారాలు చూపి వివరణ అడిగారు. అయితే తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కాంగ్రెస్ లో చేరలేదని పోచారం, అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. శనివారం తెల్లం వెంకట్రావ్, డా. సంజయ్ ల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది.
