
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి బస్టాండులో ఆదివారం ప్రయాణికుల రద్దీ ఉంది. హైదరాబాద్కు వెళ్లేవారు గంటల తరబడి నిరీక్షించారు. వరుసగా 3 రోజులు సెలవులు రావటంతో హైదరాబాద్ తదితర ఏరియాల్లో ఉంటున్న ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు సొంతూళ్లకు వచ్చారు. తిరిగి హైదరాబాద్కు వెళ్తుండడంతో బస్సులు కిక్కిరిశాయి.