
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం గౌరారం-కె.లక్మిపురం మధ్య లో గుబ్బలమంగి వాగు కూడా వరద నీటితో పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ ధాటికి ఆదివాసీలు వాగు దాటలేక , ఊరుకు చేరికోలేక ఇబ్బందిపడ్డారు. అదే సమయం లో అటుగా కూంబింగ్ కు వెళ్లిన 212 బెటాలియన్ CRPF జవాన్లు ఆ ఆదివాసులకు అండగా నిలిచారు. తమ దగ్గరున్న రోప్ సాయంతో గ్రామస్తులను వాగు దాటించారు. క్షేమంగా అవతల ఒడ్డుకు చేర్చారు.