మై హోం రామేశ్వర్ రావు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తా

మై హోం రామేశ్వర్ రావు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తా

హైదరాబాద్, వెలుగు: ‘మై హోం’  మైనింగ్ కంపెనీలో ఐర్లాండ్​కు చెందిన సీఆర్ఎస్ అనే సంస్థ 50 శాతం విదేశీ పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు పెట్టుబడులను ఆ సంస్థ ఇంకా పెంచుకుందని, ఇది ముమ్మాటికీ అక్రమమేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ‘మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలోని మేళ్ల చెర్వును ఎంచుకుందని, ఇక్కడ ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఉత్తమ్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ‘‘జాతీయ సంపదను ఇతర దేశాలకు తరలించడం, మేళ్ల చెరువు ఫ్యాక్టరీలో అటవీ చట్టాన్ని పాటించకపోవడం, భూదాన్ భూములను ఆక్రమించుకోవడం, అన్ని చట్టాలను తుంగలో తొక్కి రామేశ్వర్ రావు అక్రమాలకు తెరలేపారు. తెలంగాణ, ఏపీ సర్కార్ లు సైతం రామేశ్వర్​రావు కోసం చట్టాలను పట్టించుకోవడం లేదు” అని అర్వింద్​ ఆరోపించారు. రామేశ్వర్ రావు దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తానని హెచ్చరించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి సంబంధిత శాఖలకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానన్నారు. శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. రామేశ్వర్ రావు నిర్వాకం వల్ల దేశ సంపదకు కనీసం రూ. 4 లక్షల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. జయ జ్యోతి కంపెనీని బెదిరించి రామేశ్వర్ రావు స్వాధీనం చేసుకున్నారని, దీన్ని ఆయన కొనుగోలు చేసినట్లు చెపుతున్నా.. ఇందులో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

గాయత్రి మైన్స్​ రవికి పెనాల్టీ ఏమైంది?

‘మై హోం’ సంస్థనే కాదు ఇలా రాష్ట్రంలో మరెన్నో  మైనింగ్ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, గాయత్రి మైన్స్ అనేది మరొకటని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు. ఖమ్మానికి చెందిన రవి అనే టీఆర్ ఎస్ నాయకుడిది ఈ సంస్థ అని చెప్పారు. రవి గతంలో కాంగ్రెస్ లో ఉండగా ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి రూ. 10 కోట్ల పెనాల్టీ కట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో నోటీస్ జారీ చేసిందన్నారు. తమ సంస్థపై ప్రభుత్వ వేధింపులు ఎక్కువవడంతో దాన్ని తట్టుకోలేక రవి టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇదే సర్కార్ పెనాల్టీలను రద్దు చేసి అసలు మాత్రమే కట్టాలని చెప్పిందని ఆరోపించారు.

ఆ 9 మంది బతికుండగానే బావిలో పడ్డారు