క్రిప్టో కరెన్సీలపై పన్నురాయితీ లేదు

క్రిప్టో కరెన్సీలపై పన్నురాయితీ లేదు

వర్చువల్ డిజిటల్‌ అసెట్స్‌ అంటే క్రిప్టో కరెన్సీలు, ఆస్తులపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలకు పన్నురాయితీ లేదన్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్నువిధిస్తామన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే డిజిటల్‌ ఆస్తుల బదిలీపై కూడా ఒక శాతం టీడీఎస్‌ విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ బదిలీపై సర్‌ చార్జిని 15 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగించామన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ కంపెనీలకు పన్నురాయితీలు కల్పిస్తున్నామన్నారు. సహకార సంస్థల పన్ను15 శాతానికి తగ్గించామన్నారు. సహకార సంస్థల పన్నుపై సర్ ఛార్జ్ 7 శాతానికి తగ్గించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అయ్యాయన్నారు నిర్మల. ఈ ఏడాది జనవరిలో జీఎస్టీ వసూళ్లు.. రూ. 1,40,986 కోట్లు అన్నారు.  టాక్స్ రిటర్న్స్ అప్ డేట్ చేసేందుకు రెండేళ్ల సమయమన్నారు. రిటర్న్స్ లో లోపాల సవరణకు టాక్స్ పేయర్స్‌కు అవకాశం ఇస్తున్నామన్నారు.