క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు అంతమందా..డౌటే!

క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు అంతమందా..డౌటే!
  • సంఖ్య ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​

న్యూఢిల్లీ: మాక్రో ఎకనమిక్​ కండిషన్లు, ఫైనాన్షియల్​ స్టెబిలిటీ దృష్ట్యా చూస్తే క్రిప్టో కరెన్సీలు కొంత ఆందోళన కలిగించేవేనని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత దాస్​ బుధవారం చెప్పారు. బిజినెస్​ స్టాండర్డ్​ నిర్వహించిన బీఎఫ్​ఎస్​ఐ సమ్మిట్​లో దాస్​ పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీలపై తమ సజెషన్లను డిటెయిల్డ్​గా ఇచ్చామని, వాటిని చురుగ్గా పరిశీలిస్తున్న ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీలలో ఇన్వెస్టర్ల సంఖ్య భారీగానే పెరుగుతోందని ఆయన చెప్పారు. కానీ, మార్కెట్​ చెబుతున్నంత మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సంఖ్యను కొంత ఎక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీలపై రెగ్యులేషన్​ లేకపోవడంతో, వాటి పూర్తి డేటా  ఆర్​బీఐకి అందుబాటులో ఉండవని అన్నారు. క్రిప్టో ఇన్వెస్టర్లలో 70 శాతం మంది రూ. 1,000 నుంచి రూ. 2,000 ఇన్వెస్ట్​ చేసిన వాళ్లేనని, బహుశా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేస్తుండొచ్చని పేర్కొన్నారు. మాక్రో ఎకనమిక్​ కండిషన్లు, ఫైనాన్షియల్​ స్టెబిలిటీ ప్రకారం చూస్తే సెంట్రల్​ బ్యాంకుగా తమకు క్రిప్టో కరెన్సీలపై  అభ్యంతరాలున్నాయని మరోసారి దాస్​ వెల్లడించారు. ఏదేమైనా మేమిచ్చిన సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం తీసుకోవల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

నా దగ్గర క్రిప్టో కరెన్సీ ఉంది.. యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్

వ్యక్తిగతంగా తన వద్ద క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ వెల్లడించారు. న్యూయార్క్​ టైమ్స్​ డీల్​బుక్​ ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో కుక్​ మాట్లాడారు. ఈ సందర్భంగా బిట్​కాయిన్​ వంటి క్రిప్టోలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీలపై ఆసక్తి పెరిగిందని, ఫలితంగా తాను వాటిపై రీసెర్చ్​ చేస్తున్నానని కుక్​ పేర్కొన్నారు. పోర్ట్​ఫోలియోలో భాగంగా క్రిప్టో కరెన్సీలూ ఉండాలనుకుంటున్నానని వివరించారు. అయితే, తాను క్రిప్టోలపై ఎలాంటి ఇన్వెస్ట్​మెంట్​ సలహాలూ ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.

క్రిప్టోవైపు యాపిల్​ చూపు...

క్రిప్టో కరెన్సీ వైపు యాపిల్​ చూస్తోందని కూడా టిమ్​ కుక్​ వెల్లడించారు. కానీ, వెంటనే క్రిప్టోను యాపిల్​ పేలో లాంఛ్​ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. టెస్లాలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టే ఉద్దేశం యాపిల్​కు లేదన్నారు. యాపిల్​ ఇన్వెస్టర్లు క్రిప్టోల కోసం యాపిల్​ షేర్లను కొనడం లేదన్నారు. తమ ప్రొడక్టులకు క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్​ చేసే ప్రపోజల్​ కూడా వెంటనే ఏమీ లేదని చెప్పారు. క్రిప్టో ప్రపంచంలో ఎన్​ఎఫ్​టీ ఆసక్తికలిగిస్తున్నాయన్నారు. 

కమీషన్​ సమంజసమే..

యాప్​ స్టోర్​లో వసూలు చేసే కమీషన్​ సమంజసమైనదేనని టిమ్​ కుక్​ కాన్ఫరెన్స్​లో సమర్ధించుకున్నారు. డెవలపర్లలో ఎక్కువ మంది నుంచి పూర్తి 30% కాకుండా, 15 శాతాన్నే వసూలు చేస్తున్నట్లు చెప్పారు. యాప్​ స్టోర్లో మరిన్ని మార్పులు భవిష్యత్​లో రానున్నాయని తెలిపారు. యాప్​ స్టోర్​ నుంచి కాకుండా ఆన్​లైన్​లో లేదా ఇతర మార్గాలలో యాప్​లు డౌన్​లోడ్​ చేసుకునే వాళ్లు ఐఫోన్​ కాకుండా యాండ్రాయిడ్​ ఫోన్లు కొనుక్కోవచ్చన్నారు.