సెమీ కండక్టర్ మ్యూజియం.. నేటి యువతకు ఆశాకిరణం: సీ.ఎస్. రంగరాజన్

సెమీ కండక్టర్ మ్యూజియం.. నేటి యువతకు ఆశాకిరణం: సీ.ఎస్. రంగరాజన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలో ప్రారంభమైన ఇండియా తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన పూజారి డా. సీ.ఎస్. రంగరాజన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా 1988లో బయోమెడికల్ ఇంజినీరింగ్‌‌లో డిగ్రీ పూర్తిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తమ కాలంలో ఆలోచనలు ఉండేవని, కానీ వాటిని పెంపొందించేందుకు అవసరమైన మద్దతు లేకపోయిందన్నారు. 

ఈ మ్యూజియం నేటి తరం యువతకి ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు. టెక్ మాస్టర్లను తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాలని ఆశీర్వదించారు. టీ-చిప్ చైర్మన్, ఎండీ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ.. ఇది కేవలం మ్యూజియం మాత్రమే కాదని, భారతదేశపు సెమీకండక్టర్ ఫ్యూచర్​కు ఆకారమిస్తున్న టెక్నాలజీలకు గేట్​వే అని అన్నారు. హర్యానా మాజీ గవర్నర్​బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.