మేడారం జాతర ఏర్పాట్లపై సీఎస్, డీజీపి టెలీ కాన్ఫరెన్స్

మేడారం జాతర ఏర్పాట్లపై సీఎస్, డీజీపి టెలీ కాన్ఫరెన్స్

టెలీ కాన్ఫరెన్స్ కు హాజరైన పలు విభాగాల అధికారులు

హైదరాబాద్: మేడారం జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో పోలీసు, రెవిన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, విధ్యుత్, పశు సంవర్ధక శాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా మేడారం జాతర ఈ నెల 16 వ తేదీ నుంచి 19 వరకు జరుగుతుందన్నారు. కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని,  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎస్ తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3850 బస్సులతో దాదాపు 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతో పాటు మరో 35 హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామన్నారు. స్నాన ఘట్టాలు, 327 లొకేషన్లలో మొత్తం 6700 టాయిలెట్ల నిర్మాణం చేపట్టామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనపు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, జాతరలో 18 ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల కోసం క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పంచాయితీ రాజ్ శాఖ నుంచి 5000 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దాదాపు 9 వేల మంది పోలీసులను విధుల్లో నియమించినట్లు డీజీపి తెలిపారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు.. సరిపడా ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

For More News..

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్