త్వరలో 16,940 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ : సీఎస్

త్వరలో 16,940 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ : సీఎస్

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇవాళ బీఆర్కే భవన్ లో TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డితో కలిసి సమావేశమై రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పై చర్చించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల్లోని ఉన్నతాధికారులు సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా వివరాలను త్వరగా TSPSC కి అందిస్తే..వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.