పొల్యూషన్ తగ్గించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు

పొల్యూషన్ తగ్గించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు
  • చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్ వెహికల్స్(ఈవీ)పై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్‌‌ లు తగ్గించిందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుందని, సిటీలలో.. గ్రామాల్లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను మొదలు పెట్టిందని చెప్పారు. గురువారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆన్ ఎకో సిస్టమ్స్, మిటిగేషన్ అండ్ ఎడాప్టేషన్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన నేషనల్ సెమినార్​ను సీఎస్ ప్రారంభించారు. కాలుష్యం తగ్గించేందుకు రాష్ట్ర సర్కారు 254 కోట్ల మొక్కలతో హరితహారం చేపట్టిందని, 4 వేల మొక్కలతో పల్లె ప్రకృతి వనాలు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలు స్టార్ట్ చేసిందని, ఈ ఏడాదిలో 20 వేల ఎకరాల ప్లాంటేషన్ పూర్తయిందని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో 1,360 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు.

ప్యాక్స్‌‌ కంప్యూటరైజ్‌‌లో రాష్ట్రమే టాప్

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)ను కంప్యూటరైజ్‌‌ చేశామని సోమేశ్ కుమార్ అన్నారు. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మన రాష్ట్రమే టాప్-లో ఉందని తెలిపారు. గురువారం బీఆర్‌‌కే భవన్‌‌లో కో-ఆపరేటివ్ క్రెడిట్ సంస్థల పర్యవేక్షణపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకుల పనితీరును సమీక్షించారు. సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి బ్యాంకర్లు దృష్టి పెట్టాలని కోరారు.