ఐపీఎల్ కప్పుతో చెన్నై శ్రీవారిని దర్శించుకున్న సీఎస్కే యాజమాన్యం

ఐపీఎల్ కప్పుతో  చెన్నై శ్రీవారిని దర్శించుకున్న సీఎస్కే యాజమాన్యం

 చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కప్పు సాధించింది.  సీఎస్కే యాజమాన్యం చెన్నైలోని శ్రీవారి ఆలయంలో కప్పుతో ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్కే విజయం సాధించిన ప్రతిసారి చెన్నై వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.  ఈ క్రమంలో సీఎస్కే యాజమాన్యం విమానాశ్రయం నేరుగా  ఆలయానికి వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

వారెవ్వా.. వాట్ ఏ మ్యాచ్.. రిజ‌ర్వ్ డే ఫైన‌ల్ మ్యాచ్‌ అభిమానుల‌కు మ‌స్త్‌ థ్రిల్‌నిచ్చింది. ఉత్కంఠ పోరులో నాలుగు సార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ అద‌ర‌గొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ర‌వీంద్ర జ‌డేజా(15 నాటౌట్ : 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌ ) సంచ‌ల‌న బ్యాటింగ్‌తో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఆఖ‌రి ఓవ‌ర్ దాకా పోరాడిన‌ డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్‌ టైటాన్స్‌కు నిరాశ త‌ప్పలేదు.


మోహిత్ శ‌ర్మ వేసిన 15వ‌ ఓవ‌ర్లో చెన్నై విజ‌యానికి 13 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌య్యాయి. తొలి నాలుగు బంతుల‌కు 3 ర‌న్స్ వ‌చ్చాయి. దో బంతికి ర‌వీంద్ర జ‌డేజా(15) లాంగాన్‌లో సిక్స్ బాదాడు. ఆఖ‌రి బాల్‌కు ఫోర్ కొట్టాడు. దాంతో, చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ శివం దూబే(32) నాటౌట్‌గా నిలిచాడు.