CSK : పుల్వామా జవాన్ల కుటుంబాలకు ఫస్ట్ మ్యాచ్ ఆదాయం

CSK : పుల్వామా జవాన్ల కుటుంబాలకు ఫస్ట్ మ్యాచ్ ఆదాయం

చెన్నై: పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు వస్తూనే ఉన్నాయి. IPL ప్రారంభ వేడుకులు క్యాన్సిల్ చేసి, ఆ డబ్బుతో అమర జవాన్ల కుటుంబాలకు ఇస్తున్నట్లు ఇప్పటికే BCCI అనౌన్స్ చేసింది. ఇప్పుడు తమవంతు సాయం చేస్తామంటూ ముందుకు వచ్చింది CSK. మరో రెండు రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఫస్ట్ మ్యాచ్‌ CSK- RCB  మధ్య చెపాక్‌ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు  అనౌన్స్ చేసింది CSK.  ధోనీ చేతుల మీదుగా చెక్‌ ను అందిచనున్నట్లు గురువారం CSK డైరెక్టర్‌ రాకేశ్‌ సింగ్‌ తెలిపారు.

మ్యాచ్‌ జరిగేది ధోనీ సారథ్యంలోని CSK, విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ గా ఉన్న RCB మధ్య కావడంతో ఈ మ్యాచ్‌ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఈ మ్యాచ్‌ టికెట్లను అమ్మకానికి పెట్టిన రోజే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇంతకుముందు పుల్వామా దాడి బాధితుల పట్ల టీమిండియా తన దాతృత్వాన్ని చూపింది.  కొద్ది రోజుల ముందు ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆటగాళ్లకు వచ్చే ఫీజు మొత్తాన్ని అమరజవాన్ల కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపాడు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.