IPL 2024: చెన్నై విజయం ఖాయమేనా.. చెపాక్ స్టేడియంలో ఆర్సీబీకు చెత్త రికార్డ్

IPL 2024: చెన్నై విజయం ఖాయమేనా.. చెపాక్ స్టేడియంలో ఆర్సీబీకు చెత్త రికార్డ్

ఐపీఎల్ లో సొంతగడ్డపై ఆడటం ఏ జట్టుకైనా కలిసి వచ్చే విషయమే. అయితే కొన్ని జట్లు మాత్రం వేదికలతో సంబంధం లేకుండా వరుస విజయాలు సాధిస్తాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు ఈ లిస్టులో ఉంటాయి. ఇదిలా ఉంటే.. కొన్ని వేదికలపై మాత్రం కొన్ని జట్లు గెలవడానికి తంటాలు పడుతుంటాయి. వాటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటి.   

బెంగళూరు జట్టు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టు చెన్నైకు చేరుకుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. జట్ల పరంగా చూస్తే రెండు బలంగా కనబడుతున్నా.. ఒక విషయంలో మాత్రం బెంగళూరు కంగారు పడుతుంది. అదేంటో కాదు చెపాక్ మైదానం. ఈ స్టేడియంలో జరిగిన ప్రతిసారి ఆర్సీబీ జట్టుకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. చెపాక్ లో చెన్నై జట్టుపై ఇప్పటివరకు 8 మ్యాచ్ లాడితే కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీన్ని బట్టి ఆర్సీబీపై చెన్నై ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. 

ప్రస్తుతం బెంగళూరు జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్, పటిదార్, గ్రీన్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ ఆర్సీబీ సొంతం. అయితే ఆ జట్టు బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తుంది. సిరాజ్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ బౌలర్ లేదు. చెప్పక మైదానం స్పిన్ కు అనుకూలిస్తుండడంతో స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఆర్సీబీ జట్టులో పేరున్న స్పిన్నర్ లేకపోగా.. చెన్నై స్పిన్ అటాకింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. తీక్షన,.రవీంద్ర జడేజా, సాంట్నర్, మొయిన్ అలీ లతో బలంగా కనిపిస్తుంది. ఏదైనా చెన్నై గడ్డపై ధోనీ సేనను ఓడించాలంటే బెంగళూరు జట్టు శక్తికి మించి రాణించాల్సిందే.