IPL 2024 ఉప్పల్ మ్యాచ్లకు గట్టి భద్రత: రాచకొండ సీపీ

IPL 2024 ఉప్పల్ మ్యాచ్లకు గట్టి భద్రత: రాచకొండ సీపీ

హైదరాబాద్: ఐపీఎల్ 2024 క్రికెట్ మ్యాచ్ లకోసం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ ల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. మ్యాచ్ ల సందర్భంగా భద్రతా ఏర్పట్లపై మంగళవారం(మార్చి 19) రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సీనియర్ అధికారులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

ఐపీఎల్ మ్యాచ్ లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీపీ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. కఠినమైన భద్రతా ప్రోటోకాల్ ను కొనసాగిస్తూ ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. 

ట్రాఫిక్ క్రమబద్దీకరణకు.. కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ప్రధానంగా ఉప్పల్ రహదారిపై ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. స్టేడియం పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సూచించారు. 

టికెట్ల పంపిణీ విషయంలో గందరగోళం తలెత్తకుండా చూడాలని ఐపీఎల్ మేనేజ్ మెంట్ బృందాన్ని కోరారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లకు వచ్చే క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాటు చేశారు. 

టికెట్ల పంపిణీలో పారదర్శక ఉండాలని సీపీ తరుణ్ జోషి సూచించారు. నకిలీ టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read :చెన్నై విజయం ఖాయమేనా.. చెపాక్ స్టేడియంలో ఆర్సీబీకు చెత్త రికార్డ్