ITI Jobs: సీఎస్ఎల్​లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్​

ITI Jobs: సీఎస్ఎల్​లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్​

కొచ్చిన్ షిప్​యార్డ్(సీఎస్ఎల్) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 16

పోస్టులు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్(06)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 18 సంవత్సరాలు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
లాస్ట్ డేట్: జూన్ 16. 
సెలెక్షన్ ప్రాసెస్: ఐటీఐ ట్రేడులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్​లు 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచ్చి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూన్ 20న నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 


పోస్టులు: ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్(బీఈ లేదా బీటెక్), నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జూన్ 20. 
సెలెక్షన్ ప్రాసెస్: ఐటీఐ ట్రేడులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.