కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం (సీఎస్‌యూ) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
- మొత్తం ఖాళీలు: 15.
- విభాగాల వారీగా ఖాళీలు: పోస్ట్ డాక్టోరల్ ఫెలో 1, ప్రాజెక్ట్ ఫెలో 4, ఆఫీస్ అసిస్టెంట్ 1, గెస్ట్ ఫ్యాకల్టీ (యోగిక్ సైన్స్) 2, యంగ్ ప్రొఫెషనల్స్ (ఆయుర్వేద గురుకులం) 3, టెక్నికల్ అసిస్టెంట్ 1, సిస్టమ్ అనలిస్ట్ 1, అకౌంట్ ఆఫీసర్ 1, వీడియో ఎడిటర్ 1.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డి, మాస్టర్స్/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఏఎంఎస్ , ఎంసీఏ/ బీఈ/ బి.టెక్, కామర్స్/ ఫైనాన్స్/ అకౌంటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్ కమ్యూనికేషన్/ మీడియా/ ఫిల్మ్/ వీడియో ఎడిటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: మే 24.
- లాస్ట్ డేట్: జూన్ 7.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sanskrit.nic.inను సందర్శించండి.
