మందు కోసం ఏపీ నుంచి తెలంగాణకు క్యూ

మందు కోసం ఏపీ నుంచి తెలంగాణకు క్యూ

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు పెరగడంతో పాటు…టైం లిమిట్ విధించడంతో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు క్యూ కడుతున్నారు మద్యం ప్రియులు. దీంతో ఏపీ బోర్డర్ లోని తెలంగాణలో ఉన్న లిక్కర్ షాపులు కళకళలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధికంగా మద్యం అమ్ముడయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో  మద్యం ధరలు పెరగడం, రాత్రి 8 గంటలకే షాపులు మూతపడుతున్నాయి. దీంతో లిక్కర్ ను తెలంగాణ ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మండలాల్లోని ప్రజలు తమకు సమీపంలోని తెలంగాణ గ్రామాల్లోని మద్యం షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని మద్యం షాపులకు తాకిడి పెరిగింది.

కొందరు ఇదే అదునుగా కొందరు అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన లిక్కర్ ను స్థానికంగా ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.