విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి: మంత్రి వివేక్

విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి: మంత్రి వివేక్

రవీంద్రభారతి, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను చిన్నతనం నుంచే నేర్పించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా.జి.వివేక్ వెంకట స్వామి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 44వ వార్షికోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సామాజిక సేవలు చేస్తున్న ఏపీ నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్సై అభిమన్యు, ఇంటర్నేషనల్ సాఫ్ట్ బాల్ ప్లేయర్ ప్రవళికను మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాల చారితో కలిసి మంత్రి మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ స్థాపించిన డా.దేవసేన ఎంతో మంది పిల్లలకు భరతనాట్యం , కూచిపూడి నృత్యాలలో శిక్షణ ఇస్తూ , వారిని కళాకారులుగా తీర్చిదిద్దరని కొనియాడారు.

 ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీకి తన వంతుగా 50 వేల రూపాయలను ప్రకటించారు. కాగా, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మాటుగూడెం గ్రామంలో ఈ నెల 13న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామిని వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సుల్తాన్​పూర్ (భ్యాగరి) వెంకటయ్య ఆహ్వానించారు.