ఏపీలో పాక్షిక లాక్ డౌన్

V6 Velugu Posted on May 03, 2021

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోవిడ్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే-5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌ అమలు కానుంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ  కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Tagged andhrapradesh, corona, CM Jagan, , Daytime Curfew, Daytime

Latest Videos

Subscribe Now

More News