
టీమిండియా బౌలింగ్ యూనిట్‌పై సచిన్
సౌతాంప్టన్: జస్ప్రీత్బుమ్రా నేతృత్వంలోని ప్రస్తుత టీమిండియా బౌలింగ్ విభాగం ఈ తరానికే అత్యుత్తమం అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అదే విధంగా 2003, 2011 వరల్డ్‌కప్ ఆడిన బౌలింగ్ యూనిట్‌లతో ప్రస్తుత విభాగాన్ని పోల్చడం కరెక్టు కాదన్నాడు. ప్రస్తుత టీమిండియా బౌలింగ్ విభాగాన్ని కావాలంటే ప్రత్యర్థి జట్లుతో పోల్చవచ్చని మాస్టర్ తెలిపాడు. అయితే వరల్డ్‌కప్ బరిలో నిలిచిన ఇండియా బౌలర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారన్నాడు. కొంతకాలంగా వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న బుమ్రా ఈసారి మన జట్టు ట్రంప్ కార్డ్ అని పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో పరుగుల నియంత్రణకు, వికెట్లు తీయడానికి కుల్దీప్, చహల్ లాంటి మంచి రిస్ట్ స్పిన్నర్లు జట్టుకు అందుబాటులో ఉండడంతో ఈ తరానికి టీమిండియా బెస్ట్ బౌలింగ్ విభాగం ఇదేనని సచిన్ తెలిపాడు.