పొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి

V6 Velugu Posted on Oct 03, 2021

కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోటు చేసుకుంది. అరిగిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన అర్జునరావు, అజయ్ తండ్రీ కొడుకులు.. వీరు వరి పొలంలో పనిచేస్తుండగా పొలం కంచెకు కరెంట్ సరఫరా అయింది. కంచెకు సమీపంలోనే పనిచేస్తున్న తండ్రీకొడుకులు కరెంట్ షాక్ గురై విలవిలలాడుతూ కుప్పకూలిపోయారు. పక్క పొలాల్లోన వారు వచ్చి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Tagged VIjayawada, AP, Amaravati, Andhra Pradesh, ajay, Father and Son, Krishna District, , ap updates, bejawada, mailavaram mandal, t.gannavaram village, arigipalli mandalam, eedara village, arjunarao

Latest Videos

Subscribe Now

More News