నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ఆగిన కరెంట్ సప్లయ్

నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ఆగిన కరెంట్ సప్లయ్

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం కరెంట్ సప్లై నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఉదయం నుంచి రాత్రి వరకు అంధకారం నెలకొంది. రాత్రి 9 గంటల వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోగులకు టార్చ్ లైట్ల వెలుగులోనే వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యుత్​పరఫరాను పునరుద్ధరించని అధికారులపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.