గ్రేటర్​ మీటర్ గిర్రున తిరుగుతోంది

గ్రేటర్​ మీటర్ గిర్రున తిరుగుతోంది

డైలీ 67 మిలియన్ ​యూనిట్లు కరెంట్​ వాడకం
లాక్​డౌన్​కి ముందు 40 మి.యూనిట్లే
ఎండలకు 24 గంటలు ఆన్​లో ఉంటున్న ఏసీలు, కూలర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ​హైదరాబాద్ లో కరెంట్ ​వాడకం పెరిగింది. జనతా కర్ఫ్యూకు ముందు కంటే డైలీ 27 మిలియన్​ యూనిట్లు ఎక్కువ వినియోగిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువవడం ఇందుక్కారణంగా చెప్తున్నారు. దానికితోడు లాక్​డౌన్ రిలాక్సేషన్స్​తో కమర్షియల్​యాక్టివిటీస్​కూడా స్టార్ట్​ అయ్యాయి.

కిందటేడుతో చూస్తే…

గ్రేటర్​లో 44 లక్షలకుపైగా డొమెస్టిక్​, 7 లక్షలకుపైగా కమర్షియల్​, 50 వేలకుపైగా ఇండస్ట్రీ, లక్షకు పైగా స్ట్రీట్​లైట్​కనెక్షన్లు ఉన్నాయి. వాస్తవానికి ఏటా మే నెలలో కరెంట్​వాడకం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం డైలీ 67 మిలియన్ యూనిట్ల(ఎంయూ) కరెంట్​ కాలుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో10 రోజుల నుంచి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు 24 గంటలూ నడుస్తున్నాయి. దాంతో లాక్​ డౌన్​కు ముందు 40 ఎంయూలుగా ఉన్న వాడకం ఒక్కసారిగా పెరిగింది. గతేడాది మే తో చూస్తే మాత్రం  ఇది తక్కువే. అప్పుడు 72 ఎంయూల యూసేజ్​ఉంది. డిమాండ్​ మరింత పెరిగితే అదనపు ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు అవసరమవుతాయని, ఆ మేరకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు.

ఈసారీ పాత బిల్లే

కరోనా ఎఫెక్ట్​తో నిలిచిపోయిన బిల్లింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల కూడా గతేడాది మే నెలలో వచ్చిన బిల్లునే చెల్లించాలని అధికారులు తెలిపారు. 3 నెలలుగా వినియోగదారులు ఇదే ప్రకారం చెల్లిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..