Sukumar: ఆర్యలో ఆ సీన్ కోసం దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా.. సుకుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

Sukumar: ఆర్యలో ఆ సీన్ కోసం దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా.. సుకుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

ఆర్య(Arya).. ఈ సినిమా గురించి ఎంత చెప్పునా తక్కువే. వన్ సైడ్ లవ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అల్లు అర్జున్(Allu Arjun), అను మెహతా(Anu Mehtha) జంటగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక  ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చాట్ బ్లాస్టర్ గా నిలిచింది. 

తాజాగా ఈ సినిమా 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్బంగా ఆర్య 20 ఇయర్స్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ఆర్య సినిమాకు పనిచేసిన స్టార్స్ అందరు హాజరై ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వేడుకలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.. సినిమాలో ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో దిల్ రాజు గారికి నాకు చిన్న గొడవైంది.

సినిమాలో చాలా కీలకమైన ఓ మాన్టేజ్ సీన్  ఉంది. ఆ సీన్ మరోసారి చేద్దాం అనుకున్నాను. అదే విషయాన్ని దిల్ రాజుకి చెప్తే.. ఆయన వద్దని, ఇప్పటికే చాల డబ్బు ఖర్చు అయింది అన్నారు. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. ఆయనతో గొడవ పడ్డాను. ఆ తరువాత వెంటనే రాజు కాళ్ళు పట్టుకొని ఆ సీన్ చాలా ప్రత్యేకం అని చెప్పను.. అప్పుడు ఆయన అర్ధం చేసుకొని ఒప్పుకున్నారు. సినిమా బాగా రావడానికి నేను ఎంతైనా కాంప్రమైజ్ అవుతాను.. అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.