T20 World Cup 2024: అగ్రశ్రేణి జట్లతో సమరం.. ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన చిన్న దేశం

T20 World Cup 2024: అగ్రశ్రేణి జట్లతో సమరం.. ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన చిన్న దేశం

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న పురుషుల పొట్టి ప్రపంచకప్‌ సంగ్రామానికి పపువా న్యూ గినియా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు 36 ఏళ్ల బ్యాటర్ అసద్ వాలా నాయకత్వం వహించనున్నాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సీజే అమీనీ అస్సద్‌కు డిప్యూటీగా ఎంపికయ్యాడు. తూర్పు ఆసియా పసిఫిక్‌ రీజియన్ నుంచి న్యూ గినియా 2021లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది. ఆ ఎడిషన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. ఇప్పుడు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

పపువా న్యూ గినియా.. వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌, ఉగాండా జట్లతో కలిసి గ్రూప్‌-సిలో ఉంది. వీరు తమ తపోలి మ్యాచ్‌లో జూన్ 2న రెండుసార్లు పొట్టి ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్‌ తో తలపడనున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో 10 మంది 2021 ప్రపంచకప్‌ ఆడినవారే. 

పపువా న్యూ గినియా జట్టు: 

అసద్ వాలా (కెప్టెన్‌), చార్లెస్ అమిని (వైస్ కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరా.

ప్రపంచకప్‌ 2024 కోసం జట్లను ప్రకటించిన దేశాలు: న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, భారత్‌, ఆస్ట్రేలియా, ఒమన్‌, దక్షణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌, కెనడా, వెస్టిండీస్‌, యూఎస్‌ఏ, ఉగాండా, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా.

జట్లను ప్రకటించాల్సిన దేశాలు: పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్‌.